Jagamantha Kutumbam Naadhi |Chakram|Sri Lyrics - Sri
Singer | Sri |
Composer | Chakri |
Music | Chakri |
Song Writer | Sirivennela Seetharama Sastry |
Lyrics
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాదె సన్యాసం శూన్యం నావే జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయగీతాలొ కన్నీటి జలపాతాల నాతో నేను అనుగమిస్తు నాతో నేనే రమిస్తూ ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్నీ రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడ పిల్లల్ని జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల పూతల మంటను నేనై రవినై శశినై దివమై నిశినై
నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె నా హృదయమే నా లోగిలి నా హృదయమే నా పాటకి తల్లి నా హృదయమే నాకు ఆలి నా హృదయములో ఇది సినీవాళి
Comments
Post a Comment